
అవినీతే అసలు సమస్య!
మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏది?
సమాజంలో అవినీతే ప్రధాన సమస్యగా మారిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు గడుస్తున్నా స్వేచ్ఛ, సమానత్వం అన్నివర్గాలకు అందడం లేదని తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 60 మందిని ‘సాక్షి’ సర్వే చేయగా 24 మంది వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం వంటివి అందరికీ అందడం లేదని 23 మంది తెలిపారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే అధికార యంత్రాంగం మరింత పకడ్బందీగా పనిచేయాలని 22 మంది, చట్ట సభల్లో మార్పు రావాలని 16 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
– చేవెళ్ల
నాణ్యమైన
విద్య
8
పేదరికం
8
వైద్యం
10
కుల వివక్ష
10
అవినీతి
24

అవినీతే అసలు సమస్య!