
రైతు సంక్షేమమే ధ్యేయం
హయత్‌నగర్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కొహెడలో నిర్మించిన ఆధునిక గోదాంను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకుని, సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం ఆధునిక గోదాంలు నిర్మిస్తోందని తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు వరి పంటకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్‌లు వంగేటి లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, చేపల యాదగిరి, కృష్ణారెడ్డి, కొండ్రు స్వప్న, శ్రీనివాస్, చెక్క లక్ష్మమ్మ, శీలం లక్ష్మమ్మ, సీఈఓ రాందాస్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్‌చారి తదితరులు పాల్గొన్నారు.