
రోడ్డు పనులు అడ్డుకుంటున్న వ్యక్తిపై ఫిర్యాదు
కేశంపేట: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటున్న రైతుపై చర్యలు తీసుకోవాలని గోప్లాయకుంటతండా వాసులు శుక్రవారం తహసీల్దార్ అజాంఅలీకి వినతిపత్రం అందజేశారు. వివరాలు.. బైర్కాన్‌పల్లి శివారు గోప్లాయకుంట తండాకు 20 ఏళ్ల క్రితం కంకర రోడ్డును వేశారు. ప్రస్తుతం బీటీ రోడ్డు మంజూరు కావడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న రైతు తన పొలం పక్క నుంచి రోడ్డు వేయాలంటూ నిత్యం కాంట్రాక్టర్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. రోడ్డు నిర్మాణ మార్గం మార్చితే మిగిలిన రైతుల పొలాలు నీటమునుగుతాయని.. అధికారులు స్పందించి పాతరోడ్డు మాదిరిగానే బీటీ రోడ్డు వేసేలా తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాయికంటి రాంచంద్రయ్య, కరుణాకర్, నర్సింహ తదితరులు ఉన్నారు.