
ట్రాఫిక్ చలాన్ల సమస్య నివారించాలి
లక్డీకాపూల్ : గ్రేటర్ పరిధిలోని చర్చిల వద్ద ట్రాఫిక్ చలాన్ల సమస్యను నివారించాలంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్ జీ. చిన్నారెడ్డి పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చర్చిల వద్ద ప్రతి ఆదివారం ప్రార్థనలకు వచ్చే క్రిష్టియన్లు రోడ్డు పక్కన వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బిషప్స్, పాస్టర్స్, క్రిస్టియన్ సంఘం ప్రతినిధులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన చిన్నారెడ్డి చర్చిల వద్ద చలాన్ల సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. క్రిస్టియన్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనే సాల్మన్ రాజ్ నేతృత్వంలో ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరరయ్యారు.
సీఎం ప్రజావాణిలో బిషప్‌లు, పాస్టర్ల వినతి
డీజీపీకి లేఖ రాసిన ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి