
తల్లి దశదినకర్మ రోజే..
కుమారుడి మృతి
మొయినాబాద్: తల్లి దినవారం రోజే కుమారుడు మృతి చెందిన ఘటన మెయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లికి చెందిన కమ్మరి వెంకటేశ్ చారి(50) తల్లి పది రోజుల క్రితం మృతి చెందడంతో గురువారం దినవారం(దశదిన కర్మ) కార్యక్రమాలు ముగించారు. రాత్రి లంగర్‌హౌస్ వద్ద ఉన్న సంగెం ఆలయంలో నిద్ర చేసేందుకు తన కుమా రుడు విశాల్ చారితో కలిసి బైక్‌పై బయలుదేరారు. రాత్రి 10.50 గంటల సమయంలో పట్టణ సమీపంలోని తాజ్ హోటల్ వద్దకు రాగానే వీరి బైక్‌ను క్రేన్ ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే వెంకటేశ్‌చారి మృతి చెందినట్లు నిర్ధారించారు. విశాల్ చారి చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.