
సంక్షేమ పథకాలను వినియోగించుకోండి
మాడ్గుల: పేద, మధ్య తరగతి మహిళలు, నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని ఉన్నతాధికారి డాక్టర్ ముత్తు కుమార స్వామి, హెచ్‌ఆర్ ఖన్నా అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పశు సంవర్థక శాఖను వారు సందర్శించి మాట్లాడారు. పశు సంతతిపై మార్కెట్లో దుష్ప్రచారం పెరగడం వలన ఎన్‌ఎల్‌ఎమ్ పథకంపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఈ పథకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఇర్విన్ గ్రామంలో ఎన్‌ఎల్‌ఎమ్ స్కీమ్‌తో మంజూరైన షిప్ ఫార్మ్‌ను వారు పరిశీలించారు. రైతులకు సూచనలు చేశారు. రాష్ట్ర పశు సంవర్ధక అధికారులు మధుసూదన్, శ్రీనివాస్‌రావు, వెంకటయ్యగౌడ్, డాక్టర్ శంకర్ యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు.