
108 అంబులెన్స్‌లో ప్రసవాలు
షాద్‌నగర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణులకు 108 సిబ్బంది పురుడు పోశారు. వివరాలు.. షాబాద్ మంలడలం సర్దార్‌నగర్‌కు చెందిన తుల్జాబాయికి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను షాద్‌నగర్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు నెలలు నిండలేదని, బీపీ ఎక్కువగా ఉందని, ప్రసూతి చేసేందుకు ఇబ్బంది అవుతుందని వెంటనే హైదరాబాద్‌లోని పేట్లబుర్జు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 108 వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో ిసిబ్బంది రాంచంద్రయ్య, మహబూబ్ ఆమెకు పురుడు పోశారు. తుల్జాబాయి పండంటి ఆడ బిడ్డకు జన్మించిందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
నీలోఫర్‌కు తరలిస్తుండగా..
మొయినాబాద్: పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భణిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తెలిపిన ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన మౌనిక డెలివరీ కోసం గురువారం రాత్రి మొయినాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో సిబ్బంది ఆమెను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంలో నగరంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలిస్తుండగా పురుటి నొప్పులు ఎక్కువ అవడంతో సిబ్బంది ప్రసవం చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్రేమంగా ఉన్నారు. అనంతరం వారిని నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు.
తల్లీబిడ్డలు క్షేమం

108 అంబులెన్స్‌లో ప్రసవాలు