
సెల్‌ఫోన్ అందజేత
కేశంపేట: మండల పరిధిలోని బోధునంపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి జనవరిలో హైదరాబాద్‌లోని ఆరంఘర్ నుంచి నిర్దవెళ్లికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ పోగోట్టుకున్నాడు. సెల్‌ఫోన్ దొంగిలించిన వ్యక్తులు కృష్ణారెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి 1.45లక్షలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడంతో బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన కేశంపేట పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలోని రూ.87 వేలను కోర్టు ఆదేశాల మేరకు కృష్ణారెడ్డి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. పోగోట్టుకున్న సెల్‌ఫోన్ లభ్యం అవడంతో శుక్రవారం సీఐ నరహరి, ఎస్‌ఐ రాజ్‌కుమార్ బాధితుడు కృష్ణారెడ్డికి అందజేశారు.