
నిమ్స్‌లో స్లిట్ ల్యాంప్ ఏర్పాటు
లక్డీకాపూల్: నిమ్స్‌లో రుమటాలజీ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక స్లిట్ ల్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో సమకూర్చిన ఈ స్లిట్ ల్యాంప్‌ను శుక్రవారం డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుమటాలజీ క్లినిక్‌లో ప్రతి మంగళవారం పిల్లలకు స్లిట్ ల్యాంప్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రుమటాలజీ రోగుల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ రూ. 4 లక్షల విలువైన ఆధునిక స్లిట్ ల్యాంప్‌ను సమకూర్చిందన్నారు. క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగంలో ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో రుమటాలజీ విభాగం హెచ్‌ఓడీ డా.లీజా రాజశేఖర్, ఎల్వీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.ప్రసాంత్ గర్గ్, యూవైటిస్ నిపుణులు డా. బసు, పీడియాట్రిక్ రుమటాలజీ నిపుణుల డా.కీర్తి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.