A software employee died of a heart attack in Wonderlaa Hyderabad District
Sakshi News home page

'వండర్‌లా'లో అపశ్రుతి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి..

Aug 15 2023 6:20 AM | Updated on Aug 20 2023 4:01 PM

- - Sakshi

రంగారెడ్డి: వండర్‌లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. రైడ్స్‌ చేస్తుండగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ సంఘటన రావిర్యాల్‌ సమీపంలోని వండర్‌లాలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా కాశీంకోట మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన గుమ్మడి మనోజ్‌కుమార్‌(26) కూకట్‌పల్లిలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

ఆదివారం సెలవు కావడంతో స్నేహితులు దుర్గప్రాసాద్‌, వరప్రసాద్‌, గణేశ్‌, శ్రీకాంత్‌, ప్రశాంత్‌తో కలిసి వండర్‌లాకు వెళ్లారు. జాయింట్‌ వీల్‌ పూర్తి చేసి రోలర్‌ క్యాస్టు రైడ్‌ చేస్తుండగా మనోజ్‌కుమార్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే వండర్‌లాలోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటకు తీసుకెళ్లగా ట్యాబ్లెట్‌ ఇచ్చి పడుకోబెట్టారు. అప్పటికే పల్స్‌ రేట్‌ తగ్గిపోయి చల్లబడిపోయాడు.

హార్ట్‌ బీట్‌ సరిగా లేదని స్నేహితులు గమనించే సరికి అంబులెన్స్‌లో యంజాల్‌ సమీపంలోని మహోనియా అస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో గాంధీకి తరలించారు. అప్పటికే మనోజ్‌ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు విచారణ చేస్తున్నారు. మనోజ్‌కుమార్‌ మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement