జ్యూస్‌ కోసం బయటకు.. మధుమిత మిస్సింగ్‌! అతనిపైనే అనుమానం | - | Sakshi
Sakshi News home page

జ్యూస్‌ కోసం బయటకు.. మధుమిత మిస్సింగ్‌! అతనిపైనే అనుమానం

Jul 13 2023 1:18 AM | Updated on Jul 13 2023 1:20 PM

- - Sakshi

ఆమెతో పాటు కంపెనీలో పనిచేసే బినేష్‌ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ ఆమె భర్త ఇచ్చిన

హైదరాబాద్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సీహెచ్‌.వెంకటేశ్వర్లు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన తపన్‌ కుమార్‌ గిరి, మధుమిత డగారా(22) ఏడాది క్రితం జల్‌పల్లి శ్రీరాం కాలనీకి వలస వచ్చారు. స్థానికంగా ఉన్న పేపర్‌ ప్లేట్ల తయారీ కంపెనీలో మధుమిత పని చేస్తోంది.

10వ తేదీన అనారోగ్యంగా ఉందని ఇంటి వద్దే ఉన్న మధుమిత.. మధ్యాహ్నం సమయంలో జ్యూస్‌ తీసుకొస్తానని బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమెతో పాటు కంపెనీలో పనిచేసే బినేష్‌ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో గానీ 87126 62367 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement