వేములవాడరూరల్: వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగు అనిల్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందాడు. అనిల్‌కుమార్ స్వగ్రామం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 2008 బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ డ్రైవర్‌గా విధుల్లో చేరి స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ఎది గారు. గత రెండేళ్లుగా వేములవాడ అగ్నిమాపక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
2న అథ్లెటిక్స్ పోటీలు
సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న సిరిసిల్ల మినీ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. అండర్ 14, 16 బాల, బాలికలు పాల్గొనవచ్చన్నారు. ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన, 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వివరించారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మెరిట్ సర్టిఫికెట్, పతకాలు అందజేయడంతోపాటు, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఒరిజినల్ జనన ధ్రువీకరణపత్రం, 10వ తరగతి సర్టిఫికెట్, తీసుకురావాలన్నారు. వివరాలకు 79014 64456లో సంప్రదించాలని కోరారు.
చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చిరుజల్లులు కురిశాయి. ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 17.8 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 4.8, చందుర్తిలో 2.6, వేములవాడ రూరల్‌లో 13.3, బోయినపల్లిలో 13.2, వేములవాడలో 4.7, సిరిసిల్లలో 4.6, కోనరావుపేటలో 6.3, వీర్నపల్లిలో 16.1, గంభీరావుపేటలో 12.1, ముస్తాబాద్‌లో 12.9, తంగళ్లపల్లిలో 9.3, ఇల్లంతకుంటలో 6.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 9.6 మిల్లీ మీటర్లుగా నమోదైంది.


