సిరిసిల్ల అర్బన్: వినాయక నిమజ్జన వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. శుక్రవారం వినాయక నిమజ్జనాన్ని పురష్కరించుకొని గాంధీ చౌరస్తాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీతోపాటు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో దాదాపు రూ.20 లక్షలతో మానేరునది తీరంలో లైటింగ్, భారీక్రేన్లు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి వసతి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు అలరించాయి. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, కమిటీ సభ్యులు గాజుల వేణు, వెంకన్న, మండల సత్యం తదితరులు పాల్గొన్నారు.


