‘సెస్‌’పై సర్కారు కక్షపూరిత చర్యలు | - | Sakshi
Sakshi News home page

‘సెస్‌’పై సర్కారు కక్షపూరిత చర్యలు

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు

● సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు

సిరిసిల్లటౌన్‌: జిల్లా ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందిస్తున్న సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌)పై రాష్ట్ర సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సంస్థ చైర్మన్‌ చిక్కాల రామారావు ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలకవర్గానికి సంబంధం లేకున్నా 2016లో ఏర్పాటైన పాలకవర్గం హయాంలో జరిగిన పనులపై వివరాలు ఇవ్వాలని సహకార శాఖ ద్వారా నోటీసులు పంపారని ఆరోపించారు. 2016 నుంచి 2026 మార్చి వరకు ఇరు పాలకవర్గాలు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తమ పాలకవర్గం చేయని అక్రమాలు ఆపాదిస్తూ నోటీసులు పంపారన్నారు. ఎలాంటి విచారణకై నా సిద్ధమని స్పష్టం చేశారు. రికార్డులన్నీ ఎన్పీడీసీఎల్‌ అధికారుల వద్దే ఉన్నాయని వాటిని అందిస్తే సవివరంగా సమాధానాలు ఇస్తామన్నారు. వైస్‌చైర్మన్‌ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు కొత్తపల్లి సుధాకర్‌, అంజిరెడ్డి, గంగారాం, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, నారాయణరావు, హరిచరణ్‌రావు, దేవరాజం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement