● వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. మానేరువాగు తీరంలో నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఎస్పీ పర్యవేక్షించారు. నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాట్లు, వాహనాల రాకపోకలను పరిశీలించారు. సిరిసిల్ల డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, పోలీసు అధికారులు ఉన్నారు. అంతకుముందు స్థానిక లహరి గ్రాండ్ ఫంక్షన్‌హాల్‌లో బందోబస్తు విధులకు హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బందికి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ, భద్రత చర్యలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు.


