వేములవాడరూరల్: వేములవాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ‘ఇంగ్లిష్ ఎడ్జ్ – సంభాషించండి.. భావవ్యక్తీకరించడి.. విజయం సాధించండి’ అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ శుక్రవారం ప్రారంభమైంది. శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యా సాధికారత కార్యక్రమం–100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్, ఏఈపీ కోఆర్డినేటర్ ఎన్వీ రంగప్రసాద్, జిల్లా సమన్వయ అధికారిణి జాస్మిన్ థెరిసా, ఎస్సారార్ పాలిటెక్నిక్ ఇంగ్లిష్ లెక్చరర్ బి.నళినికుమారి, కళాశాల ప్రిన్సిపాల్ పి.ఎస్.ఆర్.శర్మ, వైస్ ప్రిన్సిపాల్ కె.లావణ్య, కోఆర్డినేటర్ కె.ప్రసన్నలత, కో–కోఆర్డినేటర్లు జి.రజిని, కె.భాగ్యలక్ష్మి, కె.సుజిత, విద్యార్థి కోఆర్డినేటర్లు పి.సౌమ్యామిశ్రా, బి.సరిత పాల్గొన్నారు.


