ఇల్లంతకుంట: గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం సమీక్షించారు. వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం, మాత శిశు ఆరోగ్య సేవలు, ఎన్‌సీడీఎస్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యసిబ్బందికి సూచించారు. గర్భిణీలను ముందుగానే గుర్తించి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు. ఇమ్యూనైజేషన్ వందశాతం ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. డాక్టర్ జీవనజ్యోతి, డీఐవో సంపత్, ఎన్సీడీఎస్ డాక్టర్ రామకృష్ణ, వీసీ సీఎం నవీన, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


