సిరిసిల్ల/వేములవాడ: వినాయక నిమజ్జన వేడుకలను దీక్ష, భక్తితో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. సిరిసిల్లలోని వరసిద్ధి వినాయక ఆలయాన్ని శనివారం సందర్శించారు. పట్టణంలోని సాయినగర్, బీ.వై.నగర్, సిక్కువాడు, ప్రెస్‌క్లబ్, రెడ్డివాడ, రాళ్లబావి, వేములవాడలోని వినాయక మండపాలను శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఇతరులు వేలెత్తి చూపకుండా భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ప్రతాప రామకృష్ణ, వికాస్‌రావు, రాపెల్లి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, నాయకులు ఎర్రం వెంకట్రాజం, అన్నల్‌దాస్ వేణు, నాగుల శ్రీనివాస్, బర్కం లక్ష్మీనవీన్‌యాదవ్, వంశీ పాల్గొన్నారు.


