ఒకప్పుడు ఊరిలోకే యూరియా బస్తాలు వచ్చేవి. ఇప్పుడు యాప్‌లో బుక్ చేసుకుంటే ఎక్కడెక్కడో దొరుకుతున్నాయి. బస్తాకు రూ.300 అయితే తెచ్చుకునేందుకు అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. మా కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
– సూర భాస్కర్, నారాయణపూర్, రైతు
స్థానికంగా దొరికేలా చూస్తాం
మండల పరిధిలోనే యూరి యా దొరకడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇతర జిల్లాలు, మండలాల్లో కాకుండా మండల రైతులకు స్థాని కంగా యూరియాను అందించాలని కలెక్టర్‌కు నివేదించాం. రైతుల ఇబ్బందులు తొలగించడానికి క లెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు.
– రాజశేఖర్, మండల వ్యవసాయాధికారి


