జీవో 97 ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జీవో 97 ఉపసంహరించుకోవాలి

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

వేములవాడ అర్బన్‌: జీవో 97ను ఉపసంహరించుకోవాలని కోరుతూ అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జేఏసీ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. వెనుకకు నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. జీవో 97తో అధ్యాపకులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

యజమానులపై చర్యలు తీసుకోవాలి

సిరిసిల్లటౌన్‌: కాటన్‌ చీరల నడిపించే కార్మికులు, ఆసాముల కూలి పెంచాలని చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో శుక్రవారం నిరసనలు హోరెత్తించారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ అనితకు వినతిపత్రం అందించి మాట్లాడారు. చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చీరలు ఉత్పత్తితో అధిక లాభాలు పొందుతూ కార్మికులకు కూలి పెంచడానికి నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమానుల మొండి వైఖరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్‌, బూర మల్లేశం. వడ్నాల వీరేశం, నగేశ్‌, చిరంజీవి, గుండేటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

‘సీఎం ప్రకటనపై అధికారులు స్పందించాలి’

సిరిసిల్లటౌన్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు సీఎం చేసిన ప్రకటనపై జిల్లా అధికారులు స్పందించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. ఈమేరకు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేశ్‌కు వినతిపత్రం అందించారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకొని అర్హులకు పంపిణీ చేయాలని కోరారు. పార్టీ నాయకులు గుంటి వేణు, సోమ నాగరాజు పాల్గొన్నారు.

భూ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): భూసర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. మండలంలోని మొర్రాయిపల్లిలో శుక్రవారం జరిగిన భూభారతి, భూరీసర్వే గ్రామసభలో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. రైతులు తాము చేసుకుంటున్న భూముల వివరాలు, ఆధారాలు, అధికారులు చూపుతూ సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే కోసం పనిచేస్తున్న సిబ్బందికి సహకరించాలన్నారు. నిర్ధేశిత సమయంలో ప్రభుత్వం సూచించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. గూడూరు, మొర్రాపూర్‌, తెర్లుమద్ది గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. ల్యాండ్‌సర్వే ఏడీ శ్రీనివాస్‌, సెస్‌ డైరెక్టర్‌ అంజిరెడ్డి, నాయబ్‌ తహసీల్దార్‌ అపర్ణ, సర్పంచులు మెంగని శ్రీనివాస్‌, సునీత, శ్రీనివాస్‌, దుర్గమ్మ, ఆర్‌ఐ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చండి

వేములవాడ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు మంజూరు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని టీఆర్టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణప్రసాద్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్న కోరారు. వేములవాడలో శుక్రవా రం పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలపై ప్రభావం చూపుతున్న ఏ–25ను సవరించాలని, ఏ–317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు కోల వినయ్‌, ప్రధాన కార్యదర్శి తుమ్మల బాబురాజు, సిరిసిల్ల మండల అధ్యక్షుడు పోతుగంటి రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement