● ముస్తాబాద్‌లో గౌడ, ఆర్యవైశ్య సంఘం, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలను సంస్కృతిని చాటేలా ఉంటాయి. నిమజ్జనం రోజు భజనలు చేస్తూ శోభాయాత్ర కనులపండువగా నిర్వహిస్తారు. డీజే సౌండ్‌లకు దూరంగా ఉంటారు.
● బందనకల్‌లో మందు, మాంసం ముట్టబోమని.. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఉపవాసాలతో వేడుకలు నిర్వహిస్తామని నిర్వాహక యువకులు ప్రతిజ్ఞ చేశారు.
● ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వేములవాడ, రుద్రంగి, బోయినపల్లి మండలాల్లోని కొన్ని గ్రా మాల్లో భజన మండళ్ల ఆధ్వర్యంలో నిత్యం రాత్రి వినాయక మండపం వద్ద భజనలు చేస్తున్నారు.
● గంభీరావుపేట, కోనరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో పలువురు యువకులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణహిత పూజలు చేస్తున్నారు.
● సిరిసిల్ల, వేములవాడల్లో గణేశుడి లడ్డూకు నిర్వహించే వేలానికి భక్తులు పోటీ పడతారు.
● సిరిసిల్లలో గణేశుని మండపాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమపూజల్లో పాల్గొంటారు.
● ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలతోపాటు పలు గ్రామాల్లో నాందేడ్ డోలు కళాకారుల ప్రదర్శనలతో గణేశుడి శోభాయాత్రలు నిర్వహిస్తారు.
● సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఇటీవల మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, డీ జేలకు దూరంగా ఉండాలన్న పిలుపుతో పలు వురు నిర్వాహకులు ఈసారి డప్పు కళాకారులను పిలిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంప్రదాయాలకు పెద్దపీట మందు, మాంసం, డీజేలకు దూరం భజనలతోనే గణపతి శోభాయాత్ర సంస్కృతిని చాటేలా వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఆదర్శంగా నిలుస్తున్న యువత
ముస్తాబాద్(సిరిసిల్ల): ఐక్యత.. దేశభక్తి..ఆధ్యాత్మికతను చాటి చెప్పేందుకు ఆరంభమైన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు.. రోజురోజుకు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల నవరాత్రి ఉత్సవాల్లో కొత్త పోకడలు ప్రవేశించాయి. డ్యాన్స్‌లు, డీజే మ్యూజిక్‌తో కొంతమంది యువత నృత్యాలు చేస్తున్నారు. భారీతనానికి వెళ్తూ ఖర్చు సైతం లక్షల నుంచి కోట్లకు చేరుకుంది. అయితే ఈ పోకడల మధ్యే కొన్ని మండపాల నిర్వాహకులు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు జరిగినన్నీ రోజులు భజనలు.. పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికతను విస్తరిస్తున్నారు.
జిల్లాలో వేడుకలు ప్రత్యేకం ఇలా..