లేబర్ అడ్డా వద్ద కూలీల పడిగాపులు తక్కువ కూలికే పనికొస్తున్న వలస కూలీలు ఇతర రాష్ట్రాల కూలీల రాకతో స్థానికులపై ప్రభావం
వేములవాడరూరల్: పని దొరుకుతుందన్న భరోసాతో వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది లేబర్ అడ్డాకు సూర్యోదయానికి ముందే చేరుకుంటారు. అరుణ కిరణాల సాక్షిగా ఎవరైనా పని ఇస్తారనే ఆశలు చిగురిస్తుంటా యి. అందరికీ పని దొరకడం లేదు. చాలా మంది ని రాశతో వెనుదిరుగుతున్నారు. వేములవాడలో రోజూ ఉదయం లేబర్ అడ్డా వద్ద వందలాది కూలీ లు గుమిగూడుతున్నారు. భవన నిర్మాణ పనుల కో సం యజమానులు, కాంట్రాక్టర్లు వచ్చి కూలీలను తీసుకెళ్తుంటారు. అవసరానికి మించి కూలీలు ఉండటంతో అందరికీ పని దొరకడం లేదు.
పని దొరికితే పండుగే..
రోజంతా కష్టపడితే వచ్చే కూలీతోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. ఒక రోజు పని దొరికితే మరో రోజు పని లేక ఇంటి వద్దే ఉండాల్సి వస్తోందని పలువురు కూలీలు వాపోతున్నారు. పని లేని రోజుల్లో కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు దృష్టి సారించాలి
కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉపాధి అవకాశాలు, ఇతర సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని కూలీలు కోరుతున్నారు. లేబర్ అడ్డా వద ్ద ఎలాంటి సౌకర్యాలు లేవు. వర్షాకాలం తడుస్తూ ఇబ్బంది ప డుతున్నారు. మూత్రశాలలు, నీటి సౌకర్యం లేదు.
ఇతర రాష్ట్రాల కూలీల రాకతో..
ఇసుక కొరత, పెరుగుతున్న ధరలతో నూతన గృహాల నిర్మాణం తగ్గిపోయాయి. ఇతర రాష్ట్రాల కూలీలు రావడంతో స్థానికులకు పని దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల కూలీలు తక్కువకే పనిచేస్తుండడం కూడా స్థానికులపై ప్రభావం చూపుతుంది.


