సిరిసిల్ల: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ(డీఐపీసీ) సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులపై ఆరా తీయగా.. టీజీ ఐ–పాస్‌లో 44, టీ ప్రైడ్ కింద 83 దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని అధికారులు వివరించారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారి హనుమంతు, లీడ్‌బ్యాంక్ మేనేజర్ రాజీవ్‌కుమార్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బీఎం అనిల్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి సంగీత, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, కమర్షియల్ ట్యాక్స్ అధికారి కిరణ్, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్, టీజీఐఐసీ, పీసీబీ అధికారులు శ్రీనివాస్, విక్రమ్, కనకజ్యోతి, డీటీసీపీవో అన్సార్ పాల్గొన్నారు.
4న రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు
జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్‌సీఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహిస్తామని జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఎన్నికలు జిల్లా సమాఖ్య భవనంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఐఆర్‌సీఎస్‌లో సభ్యత్వం ఉన్న వారు పోటీ చేసేందుకు అర్హులని తెలిపారు. ఎన్నికల అధికారిగా జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్ వ్యవహరిస్తారని ప్రకటించారు.


