భజనలతోనే శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

భజనలతోనే శోభాయాత్ర

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

ముస్తాబాద్‌ గౌడ సంఘంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నాం. సంఘంలో యాభై ఏళ్లుగా వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం. భజనలతోనే గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చుతాం. ఇదే విధానం మేము పాటిస్తాం.

– తాళ్లపల్లి శ్రీనివాస్‌,

ముస్తాబాద్‌

చైతన్యం చేస్తున్నాం

గణేశ్‌నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నిర్వాహకులను కోరుతున్నాం. తొమ్మిది రోజులపాటు నిష్టగా ఉండాలని సూచిస్తున్నాం. మా విజ్ఞప్తి మేరకు మందు, మాంసానికి దూరంగా ఉంటామని పలువురు ముందుకొచ్చారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికతను పెంచేలా ఉండాలని కోరుతున్నాం. – రేపాక రాజేందర్‌శర్మ, అర్చకుడు

సంప్రదాయాలు పాటించాలి

నిర్వాహకులతో నిర్వహించిన సమావేశాలకు స్పందన వస్తోంది. మండపాలు నిర్మించిన దగ్గర నుంచి, ఆగమనం, తొమ్మిది రోజుల ఉత్సవం, శోభాయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవగాహన కల్పిస్తున్నాం. డీజేలు, సినిమా పాటలకు దూరంగా ఉంటూ, డప్పు కళాకారులను ప్రోత్సహించాలని చెప్పాం.

– కత్తురోజు నాగేంద్రచారి, డీఎస్పీ, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement