జర్మన్‌ సిల్వర్‌ వినాయకుడు ! | - | Sakshi
Sakshi News home page

జర్మన్‌ సిల్వర్‌ వినాయకుడు !

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో తొలిసారి జర్మన్‌ సిల్వర్‌ గణపతులతో కూడిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెంకంపేట(మార్గం ఫంక్షన్‌హాల్‌ ఎదురుగా) రామ్‌లాల్‌ మండప్‌లో 18వ వార్షికోత్సవం సందర్భంగా జర్మన్‌ సిల్వర్‌తో చేసిన 2,400 వినాయకుడి విగ్రహాలతో కూడిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ వెండికోటింగ్‌ గణపతుల విగ్రహాన్ని చిలువేరి రాజేశం–రాజమణి, చిలువేరి మారుతి–శ్రీదేవి దంపతులతోపాటు వారి పిల్లలు అభినవ్‌, అభిశ్రీలు అందించారు. టోకెన్‌ తీసుకున్న వారికి నిమజ్జనం రోజు సిల్వర్‌ గణపతి విగ్రహాలను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement