రెండు రోజుల కిందట తాగిన మైకంలో భార్యభర్తలు సిరిసిల్ల పాతబస్టాండ్‌లో కత్తితో గొడవపడి బీభత్సం సృష్టించారు.
జిల్లా కేంద్రంలో ఇటీవల ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ తాగిన మైకంలో ర్యాష్‌గా నడుపుతూ భయాందోళన సృష్టించాడు.
ఇటీవల మత్తులోనే రాజీవ్‌నగర్‌లో పెన్షన్ డబ్బుల కోసం ఓ వృద్ధురాలిని హతమార్చిన ఘటన కలకలం సృష్టించింది.
జిల్లాలో ఉపాధి పొందేందుకు వస్తున్న పొరుగు రాష్ట్రాల వలసకూలీలతో గంజా యి వస్తోందనే అనుమానాలు ఉన్నాయి.
‘ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ మహిళ ఇటీవల కరీంనగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న తన కూతురును చూసి తిరిగి వస్తూ.. సిరిసిల్లలో నాన్‌స్టాప్ బస్సు దిగి కామారెడ్డి బస్సు ఎక్కుతుంది. ఈక్రమంలోనే తన పర్సు పో యింది. వెంటనే తేరుకున్న ఆమె బస్సు దిగి చూడగా ఓ పదేళ్ల బాలుడు పరుగెత్తడం కనిపించింది. అతన్ని వెంబడించినా ఫలితం లేకపోవడంతో సిరిసిల్ల పోలీసులను ఆశ్రయించింది. సీసీ పుటేజీని పరిశీలించిన పోలీసులు పర్సు దొంగతనానికి పాల్పడింది మైనర్ బాలుడు అని గుర్తించారు. పర్సులో ఉన్న రూ.11వేలు, ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు పోయాయి. సదరు దొంగ మైనర్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారు.
సిరిసిల్ల: గంజాయి.. మద్యం.. గుడుంబా.. కల్లు మత్తు జిల్లాను ఆవహించింది. వీటికి అలవాటుపడ్డ వారు విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. విచక్షణ కోల్పోయి దాడిచేసుకుంటున్నారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై దాడులు చేసిన సంఘటనలు కలకలం రేపాయి.
ఇటీవల సంఘటనలు ఇలా..
ఏడాదిలో నమోదైన గంజాయి కేసులు
కేసులు 29
అరెస్టయిన వ్యక్తులు 52
డీ–అడిక్షన్ సెంటర్‌కు వెళ్లిన వారు 11
పట్టుబడిన గంజాయి 2 కిలోలు
ఇటీవల
సంఘటనలు ఇలా..


