‘చెప్పు’కోలేని కష్టం
గంభీరావుపేట(సిరిసిల్ల): యూరియా కష్టాలు ఎవరికీ ‘చెప్పు’కోవాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులు గంభీరావుపేటలోని సింగిల్‌విండో గోదాం వద్ద బుధవారం చెప్పులు క్యూలైన్‌లో పెట్టి గంటల తరబడి నిరీక్షించారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి సాయిబాబా ఆలయం వరకు బుధవారం రామహృదయ కలశ యాత్ర నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నా రు. అర్చకులు గుండయ్యశర్మ, ఆర్యవైశ్య మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రయాణికుల సౌకర్యం కోసం తంగళ్లపల్లిలో ఏర్పాటు చేసిన బస్టాండ్ కాస్త బైక్‌స్టాండ్‌లా మారిపోయింది. నిత్యం బస్టాండ్‌లోనే బైకులను నిలు పుతుండడంతో ప్రయాణికులు కూర్చోవడం కాదు..కాదు కనీసం నిల్చొనే అవకాశం లేకుండా పోయింది.


