మార్పును గమనిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

మార్పును గమనిస్తున్నాం

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

కొందరు విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనిస్తున్నాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోయింది. చెడు సావాసాలు, సెల్‌ఫోన్‌,

సోషల్‌ మీడియా ప్రభావం స్పష్టంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి

దేశాల మాదిరి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగంపై చట్టాలు రూపొందించాలి.

– పాకాల శంకర్‌గౌడ్‌,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సిరిసిల్ల

చికిత్సతో మార్పు

మత్తుకు అలవాటు పడిన వ్యక్తులు 15 రోజులు ఆస్పత్రిలో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే మార్పు వస్తుంది. రెండు నెలల కోర్సులో.. మొదటి పక్షం రోజుల్లోనే మత్తుకు బానిసగా మారిన వ్యక్తుల్లో మార్పు కనిపిస్తుంది. డీ–అడిక్షన్‌ సెంటర్‌లోనూ కౌన్సెలింగ్‌ చేస్తూ మానసికంగా సంసిద్ధులను చేస్తున్నాం. పాఠశాల స్థాయిలోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.

– డాక్టర్‌ ప్రవీణ్‌, మానసిక వైద్యనిపుణుడు, ప్రభుత్వ ఆస్పత్రి

గంజాయిపై నిఘా పెట్టాం

గంజాయి రవాణా, వినియోగంపై నిఘా ఉంచాం. పోలీస్‌శాఖతో పాటు ఎకై ్సజ్‌, రెవెన్యూ, అటవీశాఖలు సంయుక్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి సేవించిన వారిని డీ–అడిక్షన్‌ సెంటర్‌కు పంపించి వైద్యం చేయిస్తున్నాం. మార్పు రాకుంటే జైలుకు పంపిస్తాం. గంజాయి రహిత జిల్లానే మా లక్ష్యం.

– మహేశ్‌ బీ గీతే, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement