సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: 80వ స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ గరీమా అగ్రవాల్, డీపీవో ఆఫీస్‌లో ఎస్పీ మహేశ్ బీ గీతే, జిల్లా కోర్టులో ఇన్‌చార్జి జడ్జి బి.పుష్పలత జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. గాంధీచౌక్, మున్సిపల్ కార్యాలయాలపై చైర్‌పర్సన్ జిందం కళ, కమిషనర్ ఎం.ఏ.ఖదీర్‌పాషా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా గ్రంథాలయంలో చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, జెడ్పీ, విద్యాధికారి కార్యాలయాల్లో డీఈవో మొండయ్య, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్, డీటీవో ఆఫీసులో ఎంవీఐ వంశీధర్, జిల్లా ఆస్పత్రిలో సూపరింటెండ్ ప్రవీణ్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుగోపాల్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్‌బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ జెండాలను ఎగురవేశారు.
పార్టీలు..కులసంఘాలు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీజేపీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు.


