సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం శనివారం భక్తి పారవశ్యంతో పులకించింది. శ్రావణమాసం మొదటి శనివారం కావడంతో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విష్ణుసహస్ర నామాలు, నిత్యాది పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ఏకాంతసేవ నిర్వహించారు. ఆలయ అర్చకస్వాములు కృష్ణమాచారి, నవీన్‌చారి, వర్ధనాచారి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సేవలు అందించాలి
బోయినపల్లి(చొప్పదండి): కోరెం సింగిల్‌విండో చైర్‌పర్సన్‌గా నియమితులైన వన్నెల మమతతోపాటు పాలకవర్గం సభ్యులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సువీన్‌యాదవ్, వీసీ వినోద్‌రెడ్డి, వన్నెల రమణారెడ్డి, సర్పంచ్ జంగం అంజయ్య తదితరులు ఉన్నారు.


