సిరిసిల్లటౌన్: వందేమాతరం 150 వసంతాల సందర్భంగా సికింద్రాబాద్ వీర్ హనుమాన్ ఆలయం–కొండగట్టు హనుమాన్ ఆలయం– కరీంనగర్ దుర్గాభవాని దేవాలయాలకు బయలుదేరిన తిరంగా విహార్‌యాత్ర శనివారం సిరిసిల్లకు చేరింది. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ మహంకాళి జిల్లా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి స్వాగతం పలికారు. అంబేడ్కర్ చౌరస్తాలో పలువురు మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ మహంకాళి జిల్లా కార్యదర్శి అనంత్ బాగూర్ జీ, సహకార్యదర్శి వల్లకట్ల సుకుమార్‌జీ, భజరంగ్‌దళ్ సంయోజక్ వెదిరె రాంరెడ్డి, కార్యధ్యక్ష కడవ సతీశ్‌తోపాటు 80 మంది కార్యకర్తలకు స్వాగతం పలికారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ పట్టణ అధ్యక్షులు గుంటుక పురుషోత్తం, అశోక్, జిందం రవీందర్, మోర శ్రీనివాస్, ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, కోడం రవి, సుంకోజు రమేశ్‌చారి, రాపెల్లి ముకుందం పాల్గొన్నారు.


