కాశిబుగ్గ: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్యకు యత్నిస్తోందన్న సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని వరంగల్ మట్టెవాడ పోలీసులు ఆమెను గుర్తించి కాపాడారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన చందా నవ్య.. వరంగల్ భద్రకాళి ఆలయానికి శనివారం వచ్చి దర్శనం చేసుకుంది. అనంతరం, ఆరోగ్యం సరిగాలేక సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తన భర్తకు కాల్ చేసి చెప్పింది. ఆమె భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బీట్ కానిస్టేబుల్ కల్యాణ్‌కుమార్ అక్కడికి వెళ్లి భద్రకాళి గుడి సమీపంలో ఆమెను గుర్తించారు. అనంతరం మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత ఆనంద్‌కు సమాచారం ఇచ్చి అప్పగించారు.


