వేములవాడ: క్రీడలు మానసికోల్లాసాన్ని కల్గిస్తాయని సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ పేర్కొన్నారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల పోటీల విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరు నడక, ఆటల వంటి అలవాట్లు చేసుకోవాలని సూచించారు. అధ్యక్షుడు పిట్టల మనోహర్, కార్యదర్శి భానుప్రసాద్, క్రీడల కార్యదర్శి వంగల కర్ణ తదితరులు పాల్గొన్నారు.
బస్సు ప్రారంభం
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాక మీదుగా ఇల్లంతకుంట బస్టాండుకు శనివారం కరీంనగర్ డిపోకు చెందిన బస్సును ప్రారంభించారు. కరీంనగర్ డిపో నుంచి బెజ్జంకి, కల్లేపల్లి, రేపాక మీదుగా ఇల్లంతకుంటకు బస్సును పునరుద్ధరించారు. ఈసందర్భంగా రేపాకలో సర్పంచ్ మల్లేశం కొబ్బరికాయ కొట్టి బస్సుకు స్వాగతం పలికారు.


