అన్నదాత .. కన్నీటి వెత | - | Sakshi
Sakshi News home page

అన్నదాత .. కన్నీటి వెత

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

కార్తెలు కరుగుతున్నాయి. కాలం వెక్కిరిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయింది. తొలకరితో మురిపించిన వరుణుడు మళ్లీ తొంగి చూడకపోగా.. కోటి ఆశలతో వరినార్లు పోసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మడుల్లోనే నార్లు ముదిరిపోతుండగా.. వ్యవసాయబావులు, బోర్లు ఉన్నవారు ధైర్యం చేసి నాటు వేస్తే.. అప్రకటిత విద్యుత్‌ కోతలు షాక్‌నిస్తున్నాయి. పొలానికి నీరందాల్సిన సమయంలో కరెంటు కోతలతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో సరిపడా నీరులేక పంటపొలాలు బీటలు వారుతున్నాయి. పత్తి మొక్కలు చినుకులేక వాడిపోతుండగా.. ఎల్‌నినో, భూమిలో ఉష్ణోగ్రతల కారణంగా బోరుబావులు వట్టిపోతున్నాయి. వ్యవసాయ బావులు అడుగంటుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వానాకాలం సాగు ఆరంభంలోనే రైతులను కన్నీరు పెట్టిస్తుండగా.. పెట్టుబడి రావడం కూడా కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవారం రోజుల్లో వర్షాలు కురవకుంటే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపై ఎల్‌నినో ప్రభావంతో రైతులు పడుతున్న సాగు కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..!!

– మరిన్ని కథనాలు 8లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement