ఎండుతున్న వరి | - | Sakshi
Sakshi News home page

ఎండుతున్న వరి

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026

శంకరపట్నం: ఎండుతున్న ఈ వరి పొలం కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌లోని గొర్ల అనిల్‌, కుమార్‌ సోదరులది. వీరికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బావి ఆధారంగా సాగు చేస్తారు. నాలుగు ఎకరాలకు నారు పోయగా నీటి లభ్యత లేకపోవడంతో రెండు ఎకరాల్లో నాటు వేశారు. కొద్దిరోజులు సరిపడా నీరందగా.. తర్వాత బావి ఎండిపోయింది. ఫలితంగా రెండు ఎకరాల పంటతో పాటు నారు మొత్తం ఎండిపోతోంది. పెట్టుబడికి రూ.50వేలు అయ్యాయని, ఆదివారం బావి పూడిక తీయించగా మరో రూ.50వేలు అయ్యాయని అన్నదమ్ములు వాపోయారు. ఈ ఇద్దరే కాదు.. మండలవ్యాప్తంగా అన్నదాతలది ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement