గుడిసెలోనే జీవితం | - | Sakshi
Sakshi News home page

గుడిసెలోనే జీవితం

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

● ఇందిరమ్మ ఇల్లు కోసం వేడుకోలు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఉన్న ఇల్లు కూలిపోగా.. ఆ స్థలంలోనే కవర్‌తో గుడిసె వేసుకొన్ని కాలం వెల్లదీస్తున్నాడీ నిరుపేద. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అదే గుడిసెలో ఉంటున్నారు. పక్కా ఇల్లు ఇస్తే తన జీవితానికి భరోసా దక్కుతుందని నిరుపేద వేడుకుంటున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన దరిపెల్లి చంద్రశేఖర్‌ ఇన్నాళ్లు ఉంటున్న తన పాత ఇల్లు రెండేళ్ల క్రితం కూలిపోయింది. తర్వాత కొంతకాలం అద్దె ఇంట్లో ఉండగా.. యజమానులు వద్దనడంతో పాత ఇంటి అడుగుభాగంలోనే కవర్‌లతో గుడిసె వేసుకొని ఉంటున్నాడు. ఎండకు, వానకు ఇబ్బందులు పడుతూ గుడిసెలో కుటుంబం కాలం వెల్లదీస్తున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని చంద్రశేఖర్‌ కోరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement