ఎమ్మెల్యేలుగా ఎన్నికై న ‘కొమొరెడ్డి’ దంపతులు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలుగా ఎన్నికై న ‘కొమొరెడ్డి’ దంపతులు

Published Sun, Nov 12 2023 12:48 AM

జ్యోతి  - Sakshi

మెట్‌పల్లి: ఉమ్మడి జిల్లాలో కొమొరెడ్డి రామ్‌లు, జ్యోతి దంపతులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. న్యాయవిద్యను అభ్యసించిన ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మెట్‌పల్లి నియోజకవర్గానికి 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున జ్యోతి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో రామ్‌లు జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వీరిద్దరూ ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుపైనే గెలుపొందడం విశేషం. రామ్‌లు ఈ ఏడాది ఏప్రిల్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. జ్యోతి తన ఇద్దరు కుమారులతో ప్రస్తుతం మెట్‌పల్లిలో ఉంటూ కాంగ్రెస్‌ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహారిస్తున్నారు.

రామ్‌లు
1/1

రామ్‌లు

Advertisement
 
Advertisement
 
Advertisement