జగన్‌ రాజకీయ సంకల్పంతోనే బీసీలకు లబ్ధి | - | Sakshi
Sakshi News home page

జగన్‌ రాజకీయ సంకల్పంతోనే బీసీలకు లబ్ధి

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 జగన్‌ రాజకీయ సంకల్పంతోనే బీసీలకు లబ్ధి – 8లో.. టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు దోచిపెట్టేందుకే.. బాబు సర్కార్‌ మోసం చేసింది బీసీలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు జీఓ రానున్న ఎన్నికల్లో బాబుకు బీసీలు బుద్ధిచెబుతారు

న్యూస్‌రీల్‌

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు మోసం రిజర్వేషన్‌లు 50 శాతం దాటకూడదంటూ గతంలో సుప్రీం కోర్టు తీర్పులు అన్నీ తెలిసి 34 శాతం జీఓలను జారీ చేసిన బాబు ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమంటూ కొట్టేసిన హైకోర్టు చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాల నాయకులు గతంలో జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టారని ప్రశంస జిల్లాలో దాదాపు 60 శాతం బీసీ జనాభా

శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

కూటమి సర్కారు ఎన్నికల హామీలో భాగంగా చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. లేకపోతే ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చారు. రెండున్నరేళ్లు దాటినా నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇప్పుడు టీడీపీ ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు దోచిపెట్టేందుకు పాలసీ తెచ్చారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పిన నిరుద్యోగ భృతి ఇస్తే నాలాంటి వాళ్లు చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది.

– తాటి సురేంద్ర, ఎలక్ట్రికల్‌ డిప్లొమా, ఇనమనమెళ్లూరు, మద్దిపాడు మండలం

ఎన్నికల ముందు కూటమి నాయకులు వలంటీర్లకు ఇస్తున్న వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఆశ చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఊసే ఎత్తకుండా వలంటీర్‌ వ్యవస్థనే రద్దు చేసి మమ్మల్ని మోసగించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి డప్పుకొట్టే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ విడుదల చేసింది. అందుకు ఖర్చుపెట్టే డబ్బు ప్రజల సొత్తుకాదా? వారు ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తారు? అడిగేవారు లేరని ఇష్టం వచ్చినట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

– కర్నాటి శివరామిరెడ్డి, వలంటీర్‌, మొగుళ్లపల్లి, వైపాలెం మండలం

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడిన మరో కపట నాటకం హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది. రాజ్యాంగ విరుద్ధమని తెలిసీ రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓట్లతో లబ్ధిపొందాలని చేసిన బాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్‌లు వేసింది. ఈ నేపథ్యంలో బీసీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలో చంద్రబాబు వారికి చేస్తున్న మోసంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బీసీలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్ల జీఓ విడుదల చేసింది. స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఈ జీఓ ఏ కోర్టులో నిలబడదు. కూటమి ప్రభుత్వ చర్య బీసీలను మోసం చేయటానికే. సామాజిక, ఆర్ధిక, రాజకీయ సర్వే పూర్తిచేకుండనే స్థానిక ఎన్నికలకు సిద్ధం అవడం బీసీల హక్కులను హరించినట్లే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటేందుకు వీలులేదు. శాసనసభలో చట్టం చేయకుండా కేవలం జీఓ ఇవ్వడం వలన బీసీలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. తమిళనాడులో శాసనసభ ద్వారా ప్రత్యేక చట్టంచేసి కేంద్రం ద్వారా ఆమోదింపచేయడం వల్లనే అక్కడ మొత్తం రిజర్వేషన్లు 69శాతానికి చేరాయి. దీనివలన ఏ కోర్టు జోక్యం చేసుకోలేక పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం శాసనసభలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉన్నప్పటికి ఆ పనిచేయకుండ నామమాత్రపు జీఓ ఇచ్చి బీసీలకు అన్యాయం చేస్తుంది. రిజర్వేషన్ల ముసుగులో బీసీలను మోసం చేస్తే ఊరుకునేదిలేదు. ఉద్యమానికి సమాయత్తం కావాల్సి వస్తుంది.

– అంగిరేకుల ఆదినారాయణ, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఇంటలెక్చువల్‌ అధ్యక్షుడు

రాష్ట్ర హైకోర్టు బీసీ రిజర్వేషన్‌ పెంపును కొట్టివేస్తుందని చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసు. గత 30 సంవత్సరాల నుండి బీసీల రిజర్వేషన్‌ పెంచడం... కోర్టు కొట్టివేయడం జరుగుతూనే ఉంది. బీసీల జన గణన నిర్వహించి, దాని ప్రకారం రిజర్వేషన్‌లు అమలు చేయాలి. బీసీల ఓటుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వారిని మోసం చేస్తున్నాడు. అన్ని పార్టీలతో కలిపి బహుజన ప్రజా ఫ్రంట్‌గా ఏర్పడ్డాం. రానున్న ఎన్నికలలో బీసీలు బుద్ధి చెబుతారు.

– ధరణికోట లక్ష్మీ నారాయణ, ఏఐబీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి ఉత్తర్వులు లేకుండా బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారనే చర్చ సాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్‌లు అనధికారికంగా అమలు చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఫలితంగా అనేక జనరల్‌ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. దీని వల్ల జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీపీలు, కార్పొరేటర్‌లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ల వంటి పదవుల్లో బీసీలకు పెద్ద అవకాశాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం చంద్రబాబు మాత్రం బీసీలకు మోసం చేయడమే లక్ష్యంగా సాధ్యం కాని ఉత్తర్వులు జారీ చేసి తన మార్కు రాజకీయ కుట్రను బయటపెట్టుకున్నారని బీసీ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement