వైద్యులను అవమానిస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

వైద్యులను అవమానిస్తున్న ప్రభుత్వం

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

వైద్యులను అవమానిస్తున్న ప్రభుత్వం ● వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌ ఏ4 మద్యం దుకాణాల నోటిఫికేషన్‌పై సమీక్ష స్వచ్ఛతలో మెరిసిన ప్రకాశం గ్రామ పంచాయతీలు ● రాష్ట్ర స్థాయిలో చీమకుర్తి మండలం ఆర్‌.ఎల్‌.పురం ● జిల్లా స్థాయిలో మరో నాలుగు పంచాయతీలకు పురస్కారాలు

● వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌

అద్దంకి: కర్నూలు మెడికల్‌ కళాశాలలో కార్డియో ఫెరాక్‌ సర్జన్‌గా పనిచేస్తున్న వైద్యుడిని పదోన్నతిపై నంద్యాల మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌గా నియమిస్తూ అధికారులు బుధవారం జీవో విడుదల చేసి.. ఆ తరువాత ఆయన్ను తప్పిస్తూ మరో జీవో విడుదల చేయడం వైద్యులను అవమానించడమేనని అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ మండిపడ్డారు. ఆమేరకు గురువారం ఆయన వీడియో విడుదల చేశారు. చింతలపూడి మాట్లాడుతూ అన్ని అర్హతలున్న వైద్యుడిని సూపరింటెండెంట్‌ పోస్టులో నియమిస్తే, ఆయన మీ నాయకులకు నచ్చలేదని సాయంత్రానికి ఆ జీవోను ఉపసంహరించడం ఏమిటని ప్రశ్నించారు. అంటే మీకు నచ్చని వ్యక్తి ఆ పోస్టులో ఉండకూడదనే ఇలా చేశారా? అని ప్రశ్నించారు. ఇలా జరగడం వైద్యులకే అవమానకరమని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా వైద్యులు మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి సంఘటనే తిరుమల తిరుపతిలోని ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయ వైన్స్‌ చాన్సలర్‌ విషయంలో జరిగిందని గుర్తు చేశారు. అక్కడ వయసు మళ్లిన 72 సంవత్సరాల వ్యక్తిని బాబు నిబంధనలకు విరుద్ధంగా కూర్చోబెట్టారని, దానికి కారణం ఆయన చంద్రబాబు నాయుడికి కావలసిన వ్యక్తి కావడమేనని విమర్శించారు. ఇది అరాచక పాలన కాదా అని ప్రశ్నించారు.

ఒంగోలు సబర్బన్‌: ఏ–4 మద్యం దుకాణాల నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణపై ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఎకై ్సజ్‌ అధికారులతో రాష్ట్ర అదనపు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ వి.అనసూయ గురువారం ఒంగోలులోని డీపీఈవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రెండు జిల్లాల ఎస్‌హెచ్‌వోలు, ఏఈఎస్‌లు, డీపీఈవోలు, అసిస్టెంట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌లు పాల్గొన్నారు. ఏ4 దుకాణాల నోటిఫికేషన్‌ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ పరిస్థితిని దుకాణాల వారీగా అధికారులు అదనపు కమిషనర్‌కు వివరించారు.

ఒంగోలు సబర్బన్‌: పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రకాశం జిల్లా గ్రామ పంచాయతీలు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక గుర్తింపు పొందాయి. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో ఆదర్శవంతమైన సేవలు అందించిన పంచాయతీలను ప్రభుత్వం స్వచ్ఛ పురస్కారాలకు ఎంపిక చేసింది. ‘స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాలు–2026’లో భాగంగా చీమకుర్తి మండలానికి చెందిన ఆర్‌.ఎల్‌.పురం గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయి ఉత్తమ స్వచ్ఛ గ్రామ పంచాయతీగా అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడలోని ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

జిల్లా స్థాయిలో నాలుగు పంచాయతీలకు పురస్కారాలు...

జిల్లా స్థాయిలో పారిశుద్ధ్య ప్రమాణాలు పక్కాగా అమలు చేసి ఆదర్శంగా నిలిచిన నాలుగు పంచాయతీలు స్వచ్ఛ గ్రామ పంచాయతీ అవార్డులకు ఎంపికయ్యాయి. వాటిలో దర్శి మండలం పోతవరం, కొత్తపట్నం మండలం కే.పల్లిపాలెం, ఒంగోలు మండలం యరజర్ల, సింగరాయకొండ మండలం మూలగుంటపాడు ఉన్నాయి. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య మెరుగుదలలో పంచాయతీ పాలకవర్గాలు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం ఈ విజయానికి దోహదపడిందని డీపీఓ ఎం.అనుపమ పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో విశేష కృషి చేసిన 5 మందికి ఉత్తమ స్వచ్ఛతా గ్రీన్‌ అంబాసిడర్లుగా జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో టీ యెషయా, తగరం రవి, దరసి పద్మ, జగన్నాథం శ్రీనివాసరావు, చెక్కా రామయ్య ఉన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రేపు జిల్లా స్థాయి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ వేదికపై జిల్లా స్థాయి విజేతలకు కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement