ఫోజులు ఎందుకు బాబు? | - | Sakshi
Sakshi News home page

ఫోజులు ఎందుకు బాబు?

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

వలంటీర్లను మోసం చేశారు:

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 వేల గౌరవ వేతనంతో ప్రజలకు ఎన్నో సేవలందించాం. ఎన్నికలకు ముందు వలంటీర్లను తొలగించమన్నారు. వారికి రూ.10 వేల జీతం ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోసం చేశారు. ఇప్పుడేమో వారి కార్యకర్తలకు, సోషల్‌ మీడియా వారికి లబ్ధి చేకూరేలా చేస్తున్నారు.

– జి.బాలరంగయ్య, కందులాపురం, కంభం మండలం

కరోనాలో కూడా భయపడకుండా పనిచేసాం:

వలంటీర్లు కరోనా సమయంలో కూడా భయపడకుండా ప్రజలకు సేవలందించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందించేందుకు వారధుల్లా పనిచేసాం. మేం చేసిన పనికి నాడు రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చారు. ఇప్పుడేమో టీడీపీ కార్యకర్తలకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితేనే వేలాది రుపాయలు ఇస్తామని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. – కువ్వారపు రాజు, కంభం

యర్రగొండపాలెం: ప్రభుత్వ నిధులు ఖర్చు పెడుతూ తన జోబు నుంచి తీసి ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఫోజులు ఇస్తున్నారని, తనకు డప్పు వాయించే వారికి నియామకాలు, బీమా పేరుతో పచ్చ కార్యకర్తలకు పరిహారం ఇచ్చేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. గురువారం మండలంలోని వాదంపల్లి మాజీ సర్పంచ్‌ పబ్బిశెట్టి మంజుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌ సీపీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ వర్గీయులు, పార్టీలో చేరిన వారి పింఛన్లు రద్దు చేస్తామని, ఇంటి స్థలాలు ఇవ్వబోమని, ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని టీడీపీ నాయకులు బెదిరించినా జగనన్నపై ఉన్న నమ్మకంతో ప్రజలు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు ఎనలేని సేవలు అందించే వలంటీర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తుంటే విమర్శలకు దిగారని, ప్రస్తుతం తనకు, తన కూటమి ప్రభుత్వానికి డప్పు వాయించేందుకు చంద్రబాబు ఇన్‌ప్లుయెన్సర్లను నియమించబోతున్నారని, ఇది ప్రజా ధనం దుర్వినియోగం చేయడమేనన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడ తప్పేమీ కాదని, ఆ పరిహారం తమ జోబు నుంచి తీసి ఇస్తున్నట్లు ఫోజులు కొట్టడం, టీడీపీ వర్గీయులకే వర్తించే విధంగా చేయడం సరైన పద్ధతి కాదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కార్యకర్తలకు బీమా వర్తించే విధంగా ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నిధులు చెల్లించేందుకు సిద్ధం అయ్యారని, గుర్తింపు కార్డు ఉండి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారని ఎమ్మెల్యే తాటిపర్తి గుర్తు చేశారు. ప్రభుత్వ సొత్తు రాష్ట్ర ప్రజలందరిదని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల కోసం కూయుక్తులు చేసే చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని పింఛన్లు, ఇంటి స్థలాలు ఇస్తామని ప్రకటించడం ప్రజలను మరోసారి మభ్యపెట్టడమేనని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిన వారిలో పత్తి సుబ్బారావు చౌదరి, దుగ్గినేని మల్లికార్జున చౌదరి, చేకూరి చెన్నకేశవలు చౌదరి, జెట్టబోయిన చెన్నకేశవులకు చెందిన 10 కుటుంబాలవారు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, వాదంపల్లి గ్రామ నాయకులు కన్నెబోయిన రాజయ్య, కన్నెబోయిన పాపారాయుడు, జెట్టబోయిన నాగశేషులు, మిరంపల్లి గురవయ్య, పొలిశెట్టి పిచ్చయ్య, దూదేకుల రసూల్‌, బొరిగొర్ల రాజయ్య పాల్గొన్నారు.

కాలనీ వాసులతో మాట్లాడుతున్న

కలెక్టర్‌ రాజాబాబు, జేసీ, ఎమ్మెల్యే బీఎన్‌

ఖర్చు చేస్తోంది ప్రభుత్వ సొమ్మేగా..

డప్పు వాయించే వారికి నియామకాలా?

బీమా పేరుతో పచ్చ కార్యకర్తలకు పరిహారం

సొంత నిధులతో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు జగనన్న అండ

ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌

వైఎస్సార్‌ సీపీలో చేరిన వాదంపల్లి టీడీపీ వర్గీయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement