మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే తాటిపర్తి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే తాటిపర్తి పరామర్శ

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

యర్రగొండపాలెం:

అంబులెన్స్‌ ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబాలను యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ పరామర్శించారు. స్థానిక ఏరియా వైద్యశాలలో ఉన్న మృతదేహాలను ఆయన పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లికి సమీపంలోని హైవేపై సోమేపల్లికి చెందిన బావాబావమరుదులు నాండ్రపాటి కోటేశ్వరరావు (50), పల్లెపోగు ప్రసాద్‌ (30) సొంత పనుల నిమిత్తం బైక్‌పై మార్కాపురం వెళ్తుండగా విజయవాడ నుంచి సున్నిపెంట వెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ గొల్లపల్లికి సమీపంలో ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా ఢీకొంది. బైక్‌పై ఉన్న కోటేశ్వరరావు, ప్రసాద్‌ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని వెంటనే వైద్యశాలలో చేర్పించి ప్రాణం పోసే అంబులెన్సే ప్రాణాలు తీయడం దారుణమని స్థానికులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement