తౌషిక్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి | - | Sakshi
Sakshi News home page

తౌషిక్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌

సింగరాయకొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి సయ్యద్‌ తౌషిక్‌ అనుమానాస్పద మృతి, నిరసన దీక్ష చేసినా న్యాయం లభించకపోవడంతో తౌషిక్‌ తల్లి మౌలాబీ ఆత్మహత్య ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొడుకు తౌషిక్‌ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇచ్చిన మరణ వాంగ్మూలంలో తన మరణానికి వాకా రమణారెడ్డి, వాకా సుజాత, చైతన్యరెడ్డి, అనూష, వార్డెన్‌ బాబ్జీ కారకులని తల్లి మౌలాబీ పేర్కొన్నా, నేటి వరకు వారిపై ఎటువంటి చర్యలూ లేవని విమర్శించారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మౌలాబీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు తౌషిక్‌, మౌలాబీ మృతి ఘటనలపై న్యాయపోరాటం చేసేందుకు ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారన్నారు. ప్రభుత్వం మౌలాబీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, ఇద్దరి మృతికి రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, తౌషిక్‌ అన్న తౌఫిక్‌ చదువు బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలని పార్టీ డిమాండ్‌ చేస్తున్నట్లు సురేష్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement