మాధవపెద్దికి అక్కినేని అవార్డు | - | Sakshi
Sakshi News home page

మాధవపెద్దికి అక్కినేని అవార్డు

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

మాధవపెద్దికి అక్కినేని అవార్డు

అందించిన అక్కినేని కళాపరిషత్‌

ఒంగోలు మెట్రో: తన మృధు మధురమైన సంగీతంతో ఎన్నో తెలుగు చిత్రాలకు విజయవంతమైన గీతాలను అందించిన సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌కు నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా అక్కినేని కళాపరిషత్‌ ఆధ్వర్యంలో అక్కినేని అవార్డు 2026ను ప్రదానం చేశారు. ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు స్వీకరించిన అనంతరం మాధవపెద్ది సురేష్‌ మాట్లాడుతూ సినీరంగానికి ఐదు తరాలుగా తమ కుటుంబం సేవలు అందిస్తోందన్నారు. కీబోర్డ్‌ ఆర్టిస్ట్‌గా అనేక మంది ప్రముఖ సంగీత దర్శకులకు 1500కు పైగా చిత్రాలకు వాయిద్య సహకారాన్ని అందించానని తెలిపారు. హైహై నాయక ద్వారా జంధ్యాల తనకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారన్నారు. తనను గుర్తించి అవార్డుతో సత్కరించటం తాను చేసిన సంగీతాన్ని గౌరవించడమేనని నిర్వాహకుడు అక్కినేని కళాపరిషత్‌ అధ్యక్షుడు కల్లగుంట కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశంజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో విశ్రాంత అడిషనల్‌ ఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు విశ్రాంత ఆంధ్రాబ్యాంక్‌ డీజీఎం రమణమూర్తి, అక్కినేని కళాపరిషత్‌ అధ్యక్షుడు కలగుంట కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు సీహెచ్‌ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాల్లోని పాటలతో ప్రముఖ గాయనీ గాయకులు అలరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement