అద్దంకి/అద్దంకి రూరల్: పట్టణంలోని పల్నాడు హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక (మట్టితో చేసిన) విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో రంగు రంగుల విద్యుత్ సెట్టింగులతో, దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రాజమండ్రి కళాకారుల సృంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రకాల పౌరాణిక, జానపద వేషధారణలతో కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు వాయిద్యాలు, భక్తుల గణపతి బప్పా మోరియా నినాదాల నడుమ ఊరేగింపు పట్టణంలోని పల్నాడు వైద్యశాల నుంచి గుండ్లకమ్మ వరకు సాగింది. కార్యక్రమంలో డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ వినాయక విగ్రహ వాహనానికి గుమ్మడికాయతో దిష్టి తీసి వాహనాన్ని తానే నడిపాడు. నిమజ్జన కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
రూ.1.40 లక్షలు పలికిన లడ్డూ పాట
వినాయకుని చేతిలో ఉంచి పూజలందుకున్న లడ్డూ వేలం పాటలో రూ.1.40 లక్షలు పలికింది. అత్యధిక పాట పాడిన వైఎస్సార్ సీపీ నాయకుడు మానికొండ నాగరాజు లడ్డూను దక్కించుకున్నాడు. లడ్డూ పాట నగదును గ్రంథాలయ ఉద్యమానికి అందజేయనున్నట్లు తెలిపారు.
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే విజయం
ఆ గణనాథుని కృపా కటాక్షాలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, మునిసిపాలిటీ, పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకోబోతోందని డాక్టర్ అశోక్‌కుమార్ చెప్పారు. ఆ వినాయకుడు వర్షాలు సక్రమంగా పడేలా చూసి పాడి పంట పండేలా చూడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రూ.1.40 లక్షలు పలికిన లడ్డూ పాట
అలరించిన రాజమండ్రి నృత్యాలు, దేవతా మూర్తుల వేషధారణలు
గుమ్మడికాయ దిష్టి తీసి గణనాథుని ఊరేగింపు ప్రారంభించిన డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్
పల్నాడు వైద్యశాల నుంచి గుండ్లకమ్మ వరకు సాగిన ఊరేగింపు


