నడిరోడ్డుపై యువకుల వీరంగం | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై యువకుల వీరంగం

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

కనిగిరి రూరల్‌: పట్టణంలోని ఇందిరా కాలనీలో గురువారం రాత్రి ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో హల్‌చల్‌ చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కింద పడి ఉన్న మణికంఠ అనే యువకుడిని మరో ఇద్దరు కొట్టడాన్ని అడ్డుకున్న స్థానికులపై కూడా మత్తులో ఉన్న యువకులు తిరుగుబాటు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరలైంది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరా కాలనీ సమీపంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు, మరో సామాజిక వర్గానికి చెందిన మరొకరు వినాయక నిమజ్జనం సందర్భంగా పాటలకు డ్యాన్స్‌ వేసుకుంటూ గోడవ పడ్డారు. ఈ క్రమంలో ఫుల్‌గా మత్తులో ఉన్న ఇద్దరు యువకులు మణికంఠ అనే యువకుడిని తరుముకుంటూ వెంటపడ్డారు. ఇందిరా కాలనీలోని అంకమ్మ ఇంటి వద్ద మణికంఠను కిందపడేసి మిగిలిన ఇద్దరు కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. గమనించిన కాలనీ వాసి అంకమ్మ అడ్డుకుంది. దీంతో ఆమైపె కూడా తిరగబడి దాడి చేశారు. అంకమ్మ, ఆమె కుమారుడు కృష్ణ మరికొందరు స్థానికులు మత్తులో ఉన్న ఇద్దరు యువకులను వారించారు. దీంతో ప్రాణభయంతో మణికంఠ పరిగెత్తాడు. వారి ఇద్దరిలో ఒకరిని స్థానికులు పట్టుకోగా మరొకడు పరారయ్యాడు. దొరికిన యువకుడిని చెట్టుకు కట్టేసి బాధిత కాలనీ వాసులు 100, 112కు కాల్‌ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న యువకుల బంధువులు, ఇందిరా కాలనీ వద్దకు వచ్చి స్థానికులపై తిరుగుబాటు చేశారు. అంకమ్మపై దాడి చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో కాలనీ వాసులంతా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలు అంకమ్మ తనపై పి.చరణ్‌తో పాటు మరికొందరు దాడి చేసినట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

మద్యం మత్తులో హల్‌చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement