వినాయక లడ్డు, కలశం రూ.51.02 లక్షలు | - | Sakshi
Sakshi News home page

వినాయక లడ్డు, కలశం రూ.51.02 లక్షలు

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

సీఎస్‌పురం (పామూరు): వినాయక చవితి సందర్భంగా మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలం అయ్యలూరివారిపల్లెలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో 3వ రోజు బుధవారం ఆలయం వద్ద నిర్వహించిన వేలంలో లడ్డు, కలశం కలిపి రూ.51.02 లక్షలు పలికాయి. లడ్డును జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్యాల సుబ్బారెడ్డి రూ.30,01,116 లకు దక్కించుకోగా, కలశాన్ని పాలుగుళ్ల లక్ష్మీనారాయణరెడ్డి రూ.21.01,116లకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని వైస్‌ ఎంపీపీ భూమిరెడ్డి ప్రభంజనా వెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల భారతీ నారాయణరెడ్డి, పలువురు గ్రామ నాయకులు, ఆలయ కమిటీ అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement