ఉత్తమ సేవ..
స్వాంతంత్ర దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను కమిషనర్ సన్మానించారు. అందులో నరేంద్ర కూడా ఉండడం గమనార్హం. సన్మానం అందుకున్న రెండు రోజుల్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇదే విషయం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.
ఒక ఇంటి యజమాని నుంచి ఇంటి పన్ను పేరు మార్చడం కోసం రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆర్‌ఐ నరేంద్రను రెడ్ హాండెడ్‌గా పట్టుకున్న విషయం విదితమే. నెల్లూరు ఏసీబీ కోర్టులో అతనిని బుధవారం హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
● ఒంగోలు కార్పొరేషన్‌లో డబ్బులు ఇవ్వందే పనులు జరగవు..
● అవినీతిలో మునిగి తేలుతున్న అధికారులు
● రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాల్లో బయటపడుతున్న అవినీతి
● అక్రమాలకు పాల్పడటంతో ఇక్కడ పనిచేసిన కమిషనర్‌తో పాటు ఆరుగురిపై వేటు
● తాజాగా రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కీలక అధికారి ఏసీబీ వలలో
● గతంలో కౌన్సిల్‌ను ఒంటి చేత్తో చక్రం తిప్పిన నరేంద్ర
● రిమాండ్ విధించిన నెల్లూరు ఏసీబీ కోర్టు
ఒంగోలు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) శృంగవరపు వెంకట నరేంద్ర ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలు మొదలుకొని కార్యాలయ వ్యవహారాలను ఒంటి చేత్తో నెట్టుకుంటూ వచ్చారు. మొన్నటి వరకూ పనిచేసిన మేయర్‌కు అంతరంగికుడిగా కూడా నరేంద్ర వ్యవహరించారు. ఏసీబీకి పట్టుబడిన ఆయన ఒంగోలు నగర పాలక సంస్థలో మూడు పోస్టులు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఈ–1 సీటు, ఈ–2 సీటులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్‌గా, నగర పాలక సంస్థలోని రెవెన్యూ విభాగంలో ఇంటి పన్నులు, కొళాయి పన్నులు కట్టించుకునే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. నరేంద్రపై గతంలోనూ ఏసీబీ కేసులు నమోదై ఉన్నాయి. అవినీతికి సంబంధించి ఒక కేసు ఉండగా 2017 అక్టోబరులో సంతపేటలోని తన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అప్పట్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టాడన్న ఫిర్యాదులపై దాడులు చేసి అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు నరేంద్ర కంప్యూటర్లలో పరిశీలించినప్పుడు అనేక అక్రమాలు కూడా బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. పాత కమిషనర్ కే.వెంకటేశ్వరరావు మొదలుకొని ఎవరెవరికి లంచాల రూపంలో ఎంత ముట్టిందన్న సమాచారం కూడా ఏసీబీ అధికారులకు లభ్యమైనట్లు తెలిసింది.
ఒంటి చేత్తో చక్రం తిప్పిన ఇన్‌చార్జ్ ఆర్‌ఐ నరేంద్ర...


