ఆర్టీసీలో షాపులకు టెండర్ల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో షాపులకు టెండర్ల ఆహ్వానం

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

ఒంగోలు టౌన్‌: ఆర్టీసీలో షాపుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోడా అండ్‌ కూల్‌ డ్రింక్స్‌, స్వీట్‌ బేకరి, ఫ్రూట్స్‌, ఫ్రూట్‌ జ్యూస్‌, వాటర్‌ కియోస్క్‌, పాప్‌ కార్న్‌ చిప్స్‌, ఇంటర్నెట్‌ అండ్‌ జిరాక్స్‌, సెల్‌ కార్నర్‌, డైరీ పార్లర్‌, సైకిల్‌ స్టాండ్‌, డార్మిటరీ, ఏటీఎం, ఏటీబీ ఏజెన్సీ స్టోర్స్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. సి క్లాస్‌ బస్‌స్టేషన్లలో బస్‌ స్టేషన్‌, టాయిలెట్స్‌ నిర్వహిస్తూ స్టాల్స్‌ నిర్వహణ, షాపుల పూర్తి వివరాల కోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. టెండర్‌దారులు షాపుల ప్రదేశాలను నిర్ధారించుకున్న తరువాత మాత్రమే టెండర్లలో పాల్గొనాలని తెలిపారు. ఈ నెల 20వ తేదీలోపు టెండర్లను ఒంగోలులోని జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్‌దారుల సమక్షంలో బాక్స్‌ తెరుస్తారన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, అద్దంకి బస్సు డిపోలు, మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, పొదిలి, గిద్దలూరు డిపోల్లో మేనేజర్‌ కార్యాలయంలో 19వ తేదీ వరకు దరఖాస్తులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యక్తులు ఈ టెండర్లలో పాల్గొనాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement