ఒంగోలు సిటీ: ఏకేయూ(ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం) పరిధిలోని లా కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి (2023–24 అడ్మిటెడ్ బ్యాచ్) సంబంధించిన ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. వీసీ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు వీటిని విడుదల చేశారు. పరీక్షల నియంత్రణాధికారి (సీఈ) ప్రొఫెసర్ జి.సోమశేఖర వివరాలు వెల్లడిస్తూ.. ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సుకు 51 మంది హాజరుకాగా 50 మంది (98.04 శాతం), మూడేళ్ల కోర్సుకు 282 మంది హాజరుకాగా 278 మంది (98.58 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు, సీఈ సోమశేఖర అభినందించారు. కార్యక్రమంలో పీజీ ప్రొఫెషనల్ కోర్సుల కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.అమృతవల్లీ దేవి, బీఈడీ కోర్సుల కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసు పాల్గొన్నారు.


