యర్రగొండపాలెం: మండలంలోని గురిజేపల్లి సమీపంలో హైవేపై మంగళవారం ఓ మినీ ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వలస కూలీలు జి.లోకేష్, జి.రాజు, జి.శేఖర్, వైశాలి, విజయ్, నరసింహులు, సంధ్య గాయపడ్డారు. కనిగిరి ప్రాంతానికి చెందిన 15 మంది కూలీలు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దౌలతాబాద్‌కు పనుల నిమిత్తం వెళ్లి, తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాహనం రోడ్డుకు అడ్డంగా పడటంతో కాసేపు రాకపోకలకు అంతరాయం కలగగా.. హైవే క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ తెలిపారు.
ఏడుగురు వలస కూలీలకు గాయాలు


